బ్రిక్స్‌ విస్తరించటం అమెరికాకు తీవ్ర ప్రమాదం!

న్యూయార్క్‌: బ్రిక్స్‌ విస్తరణ వేగం పెరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని, ఎందుకంటే బ్రిక్స్‌ సభ్యదేశాలు అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకుని, వాణిజ్యాన్ని తమతమ కరెన్సీలలో నిర్వహించుకుంటాయని రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ గురువారం అన్నారు. జార్జియా రాష్ట్రంలోని తన నియోజక వర్గంలో మాట్లాడుతూ జో బైడెన్‌ పాలన బ్రిక్స్‌ విస్తరణతో అమెరికా ఎదుర్కోనున్న ప్రమాదాన్ని విస్మరిస్తు న్నదని ఈ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ మహిళ జో బైడెన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శిం చింది. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలతో ఏర్పడిన బ్రిక్స్‌ మరో ఆరు దేశాలను కలుపుకుని ఒక బలమైన ఆర్థిక సమూహంగా ఏర్పడిన విషయం తెలిసిందే. బ్రిక్స్‌ ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ స్థాయిని దాటిపోయింది.
అమెరికా రష్యాకు వ్యతిరేకంగా ‘పనికిమాలిన ఉక్రెయిన్‌ యుద్ధం’లో కూరుకు పోయిందని, అమెరికా చేష్టలతో అలసిపోయిన అనేక బలమైన దేశాలు సమీక్రుతం అవుతున్నా యని ఆమె అన్నారు. ఈ అర్థంలో బ్రిక్స్‌ దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసు కుంటున్నాయి. బ్రిక్స్‌ సభ్యదేశాలలో ఒక దేశం మరొక దేశంలోని సరుకులను కొంటూ, అదే దేశానికి సరుకులను అమ్ముతూ అమెరికన్‌ డాలర్‌ను పట్టించు కోకుండా తమతమ దేశాల కరెన్సీలలోనే చెల్లింపులను జరపటం జరుగుతోంది. ఇంత కంటే అమెరికాకు ఉపద్రవం ఏముంటుందని గ్రీన్‌ ప్రశ్నిస్తోంది. బ్రిక్స్‌ బలోపేతం అవుతూ వుంటే అమెరికన్‌ డాలర్‌ బలహీనపడుతుందని, అది అంతిమంగా అమెరికా దివాళా తీయటానికే దారితీస్తుందని ఆమె అన్నారు. ఈ పరిస్థితి సాధారణ అమెరికన్ల రిటైర్మెంట్‌ ప్రాన్లను, వ్యక్తిగత పొదుపును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని ఆమె తన విచారాన్ని వ్యక్తం చేశారు. ”అమెరికన్‌ డాలర్‌ కొరగానిదైతే మన పిల్లల భవిత ఏమైపోతుంది? రష్యా, చైనా, ఇండియావంటి దేశాలలో నివసిస్తున్న వందలాది కోట్ల ప్రజలు తమతమ కరెన్సీలలోనే అమ్మకాలు, కొనుగోళ్ళు జరుపుకుంటుంటే మన డాలర్‌ ను ఎవరు పట్టించుకుంటారు. ఇంతకంటే ఆందోళన కరమైన విషయం అమెరికాకు ఏముంటుంది?” అని గ్రీన్‌ వాపోయింది.
దక్షిణ ఆఫ్రికాలో బ్రిక్స్‌ చారిత్రక శిఖరాగ్ర సదస్సు జరిగిన సందర్భంలో అమెరికన్‌ కాంగ్రేస్‌ సభ్యురాలైన గ్రీన్‌ ఇలా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ శిఖరాగ్ర సదస్సులో బ్రిక్స్‌ను విస్తరించాలనే నిర్ణయించటం జరగటమే కాకుండా అర్జటీనా, ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలను చేర్చుకోవటం కూడా జరిగింది. ఈ దేశాలు 2024నుంచి పూర్తి స్థాయి బ్రిక్స్‌ సభ్య దేశాలు అవుతాయి. ఇలా విస్తరిం పబడుతున్న బ్రిక్స్‌ పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ప్రత్యామ్నాయంగా మారు తుంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలలోని ప్రజల న్యాయమైన ఆకాంక్షలను నెరవేర్చే సాధనంగా బ్రిక్స్‌ మారుతుంది.

Spread the love