ముగిసిన కంటి వెలుగు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది జనవరి 19 న ప్రారంభం అయిన కంటి వెలుగు మండలంలో శుక్రవారంతో ముగిసింది. మూడు నెలలు పాటు, 90 రోజులు వ్యవధిలో మూడు వైద్య బృందాలు ఈ శిబిరాల్లో పాల్గొన్నాయి. అశ్వారావుపేట(వినాయకపురం) పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ రాందాస్ తెలిపిన వివరాలు ప్రకారం..  మండలంలో 30 పంచాయితీలకు గాను 20 గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు.మొత్తం 50,440 జనాభాకు గాను 19316 మందిని పరీక్షించి, 4074 మందికి కళ్ళద్దాలు అందజేసారు.

Spread the love