జేబులో పేలిపోయిన ఫోన్…

నవతెలంగాణ – కేరళ: సెల్ ఫోన్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన తెలియజేస్తోంది. తరచూ చార్జింగ్ పెడుతుండడం, బ్యాటరీ జీవిత కాలం ముగిసినా దాన్నే వినియోగిస్తుండడం చేస్తుంటారు. ఇలాంటి చర్యలు ప్రమాదాన్ని తీసుకొస్తాయన్న అవగాహన కూడా ఉండడం లేదు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో  సెల్ ఫోన్ ప్రమాదమే ఒకటి జరిగింది. 70 ఏళ్ల పెద్దాయన ఓ హోటల్లో కూర్చుని ఏదో తింటున్నాడు. ఆయన చొక్కా జేబులో సెల్ ఫోన్ పెట్టుకున్నారు. ఉన్నట్టుండి అది పేలిపోయి మంటలు వచ్చాయి. వెంటనే ఆయన రెండు చేతులతో దులిపేసుకోవడంతో సెల్ ఫోన్ కింద పడిపోయింది. జేబు ప్రాంతంలో చొక్కా కాలిపోయింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి నీళ్లు చల్లి సెల్ ఫోన్ మంటను ఆర్పేశాడు. అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Spread the love