బాణాసంచా గోడౌన్ లో పేలుడు.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – తమిళనాడు: తమిళనాడు తిరుపూర్ జిల్లాలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు జరిగిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషయంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Spread the love