అంజలి నటించిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో మంగళవారం మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. అంజలి మాట్లాడుతూ, ‘ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే క్రమంలోనే పుష్ప అనే పాత్రను ఎంచుకున్నాను. ఈ క్యారెక్టర్ నాతో ఏడాదిన్నరకు పైగా ట్రావెల్ చేసింది. ఈ పాత్రను నేను అంత ఈజీగా వదిలి పెట్టలేను. పుష్ప ఆడియెన్స్ అందరికీ నచ్చింది. నటిగా నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను. కానీ ఇలాంటి పాత్రలు రాయడం గొప్ప. బహిష్కరణను ఇంత గొప్పగా రాసిన ముఖేష్‌కి థ్యాంక్స్. ప్రసన్న విజువల్స్ గురించి అందరూ చెబుతున్నారు. సిద్దార్థ్ ఆర్‌ఆర్ అదిరిపోయింది. రవీంద్ర విజరు వంటి ఆర్టిస్ట్‌తో పని చేయడం కిక్కిస్తుంది. శివయ్య పాత్రను రవీంద్ర తప్ప ఇంకెవ్వరూ ఇంత బాగా పోషించలేరు. దర్శిగా శ్రీతేజ్ బాగా నటించారు. నిర్మాత ప్రశాంతి సహకారం లేకుంటే ఇంత బాగా వచ్చేది కాదు. ఇంత మందికి మా చిత్రం రీచ్ అయిందంటే దానికి కారణం జీ5. మా వెబ్ సిరీస్‌ను చూడని వాళ్లంతా కూడా చూడండి.. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
‘జీ5, ప్రశాంతి వల్లే నా ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. అంజలికి ఇది గేమ్ ఛేేంజర్. ఆమె ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. రవీంద్ర శివయ్య పాత్రకు న్యాయం చేశారు. ప్రసన్న విజువల్స్ అద్బుతంగా వచ్చాయి. సిద్దార్థ్ ఆర్‌ఆర్ బాగుంది. మా వెబ్ సిరీస్‌ను ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థ్యాంక్స్’ అని దర్శకుడు ముఖేష్ ప్రజాపతి చెప్పారు. రవీంద్ర విజరు మాట్లాడుతూ, ‘ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. మా వెబ్ సిరీస్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది’ అని తెలిపారు.