డిసెంబర్ ఆఖరి వారం వరకు 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరి వారం వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌-తిరుపతి (07482) రైలు డిసెంబరు 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తిరుపతి-సికింద్రాబాద్‌ (07481) డిసెంబరు 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఉంటుందని వెల్లడించింది. మరోవైపు.. హైదరాబాద్‌-నర్సాపూర్‌ (07631) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది; నర్సాపూర్‌-హైదరాబాద్‌ (07632) డిసెంబరు 3-31 వరకు ప్రతి ఆదివారం; కాకినాడ-లింగంపల్లి (07445) డిసెంబరు 1-29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉంటుందని తెలిపింది. లింగంపల్లి-కాకినాడ (07446) రైలు డిసెంబరు 2-30 వరకు ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బయల్దేరతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి మధ్య రెండు జతల ప్రత్యేక రైళ్లు తిరుగుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులంతా ఈ విషయం గమనించి వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Spread the love