నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దుర్గనగర్ మినీ గురుకులంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని ఈనెల 19 వరకు కల్పించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మినీ గురుకులాల్లో గల ఖాళీల భర్తీ కోసం సంబంధిత మండల గిరిజన విద్యార్థినులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్ ప్రక్రియ జిల్లా అదనపు కలెక్టర్ ఆమోదంతో పూర్తి చేస్తామని వివరించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు.