ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు..

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును ఇంటర్‌ బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్‌ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును జూలై 25వ తేదీ వరకు పొడగించినట్టు ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

Spread the love