విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ పాలమూరు వరకు పొడిగింపు

నవతెలంగాణ – హైదరాబాద్
మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉందానగర్‌ (శంషాబాద్‌) వాసులకు శుభవార్త. విశాఖపట్నం-కాచిగూడల మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు (నం.12862/12861)ను రైల్వేశాఖ మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించింది. ఈ నిర్ణయం మే 20 నుంచి అమలులోకి వస్తుంది. కాచిగూడ తర్వాత ఈ రైలు ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే వివరాల్ని గురువారం ప్రకటించింది.
– మహబూబ్‌నగర్‌ నుంచి సాయంత్రం 4.10 గంటలకు బయలుదేరే రైలు జడ్చర్ల 5.26కి, షాద్‌నగర్‌ 4.57, ఉందానగర్‌ 5.23, కాచిగూడ 6.10, విశాఖకు మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు చేరుకుంటుంది.
– విశాఖపట్నం నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరే రైలు కాచిగూడకు మరుసటిరోజు ఉదయం 6.45కి, ఉందానగర్‌ 7.19, షాద్‌నగర్‌ 7.44, జడ్చర్ల 8.15, మహబూబ్‌నగర్‌కి ఉదయం 9.20కి చేరుతుంది. మిగిలిన స్టేషన్ల మధ్య రైలు వేళల్లో ఎలాంటి మార్పు లేదని ద.మ.రైల్వే తెలిపింది.

Spread the love