ఎలక్షన్ కోడ్ నేపథ్యం లో మండలంలో గురువారం పసర ఎస్ ఐ ఏ కమలాకర్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పసర ఎస్సై కమలాకర్ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించటం జరిగింది. పసర గ్రామ శివారు లో జాతీయ రహదారిపై ప్రతి వాహనంను అపి క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తూ వాహన దారుల యొక్క వివరాలు తెలుసుకోవటం జరిగింది.ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం సరఫరా ను అడుకోవటనికి పగడ్బందిగా చర్యలు చేపట్టుతున్నామని ఈ సందర్బంగా ఎస్సై కమలాకర్ చెప్పటం జరిగింది.