నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనావర్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి బోనాల కిషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని పలు లాడ్జీలలో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలో లాడ్జీలలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా వాటిని నిరోధించడానికి ఈ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, ఉమెన్ ఇన్స్పెక్టర్ శ్రీలత, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి, నాలుగో టౌన్ ఎస్ హెచ్ ఓ పాండేరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు.