– ప్రజల చేతుల్లో వజ్రాయుధం : రచయిత్రి ఓల్గా
తెలంగాణ ఆవిర్భావంతో ప్రజలంతా సరికొత్త ఆలోచనల కోసం, ఆదర్శాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నవ తెలంగాణా పత్రిక మొదలయింది. ప్రజలకు అత్యవసరంగా అందించాల్సిన వార్తలను, సంచలనంగా చేయకుండా వాస్తవాలుగా అందిస్తోంది. ప్రజలలో సైంటిఫిక్ టెంపర్‌మెంట్ కలిగి, అది పెరిగే వ్యాసాలను ప్రచురించి వైజ్ఞానిక ప్రగతికి దోహదం చేస్తున్నది. ప్రజా సమస్యల గురించి ఉన్న గందరగోళాన్ని తొలగించి మంచి సామాజిక విశ్లేషణతో ప్రజలను చైతన్య పరుస్తున్నది. రాజకీయంగా పదునైన అంశాలకు చోటిచ్చి ప్రజా రాజకీయాలపై అవగాహన కలిగిస్తోంది. సాహిత్యానికి సముచిత స్థానం నవ తెలంగాణాలో ఉంది. ఒక వార్తా పత్రిక ప్రజల యెడల ఎంత బాధ్యతగా ఉండాలో అంత బాధ్యతగా ఉంటున్న నవ తెలంగాణాకు అభినందనలు. మరెన్నో సంవత్సరాలు ఇలా ప్రజలకు మార్గ నిర్దేశం చేయగలదని ఆశిస్తూ.