నవతెలంగాణ-హైదరాబాద్ : MNS చీఫ్ రాజ్‌ఠాక్రేతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ భేటీ అయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇద్దరు నేతలు సమావేశమవడం ఇదే తొలిసారి. MHలో కొద్దిరోజుల్లో స్థానికసంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతికి మద్దతిచ్చిన MNS తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఖాతా తెరవలేకపోయింది.