నవతెలంగాణ – కొనరావుపేట
గల్ఫ్ దేశానికి పంపిస్తానని డబ్బులు తీసుకొనిమోసం చేశాడని బాధితులు కుటుంబ సమేతంగా నకిలీ ఏజెంట్ ఇంటిముందు బైఠాయించిన సంఘటన మండలంలోని నిజామాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెలిమెల ఆలియాస్ చందనగిరి తిరుపతి అనే వ్యక్తి యూరప్ దేశానికి పంపిస్తానని, తమ వద్ద పది లక్షల రూపాయలు తీసుకొని దుబాయ్ వెళ్ళాడని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వెంగలి దేవయ్య, తాళ్లపల్లి రాజు, వెంగలి నవీన్, ఉరడి రాములు, కొలనూరుకు చెందిన బత్తిని రమేష్, నిజామాబాద్ గ్రామానికి చెందిన ఊరడి మధు, పిట్టల రవి అనే వ్యక్తుల వద్ద రూ.10 లక్షలు తీసుకొని 5 నెలల లోపు యూరప్ దేశానికి పంపిస్తానని అని అన్నాడని తెలిపారు. అయితే ఎవరికి చెప్పకుండానే దుబాయ్ దేశానికి వెళ్ళాడు. ఏడాదిన్నర కావస్తున్నా.. ఇంతవరకు పంపించలేదని, తమ డబ్బులు తమకు వాపస్ ఇవ్వాలని నకిలీ ఏజెంట్ ఇంటిముందు బాధితులు కుటుంబ సమేతంగా నిరసన వ్యక్తం చేశారు.