నకిలీ బాబాలను నియంత్రించాలి: ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ: యూపీ హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి ప్రకటన విడుదల చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. నకిలీ బాబాలను నియంత్రించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. సత్సంగ్ లాంటి కార్యక్రమాలకు మార్గదర్శకాలు, ప్రత్యేక చట్టాలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై రాజ్యసభ సభ్యులు సంతాపం తెలియజేశారు.

Spread the love