సూర్యాపేట ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్‌ అకౌంట్

నవతెలంగాణ – హైదరాబాద్; ఇటీవల అధికారుల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్ కేటుగాళ్లు సొమ్ము కాజేస్తున్న కేసులు ఎక్కువవుతున్నాయి. కాదేదు నకిలీకి అనర్హం అన్నట్లు పోలీసు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతల సోషల్ మీడియా అకౌంట్లతో ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి వారిలా చాట్ చేస్తూ అమాయకులకు వల వేస్తూ వారి కష్టాన్ని దోచుకుంటున్నారు.  ఇక తాజాగా సూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా క్రియేట్ చేశారు. ఎస్పీ సూర్యాపేట అనే అకౌంట్ క్రియేట్ చేసి.. ఈ నకిలీ ఖాతా నుంచి మెసేజ్‌లు, ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారు. ఇది కాస్త ఎస్పీ రాహుల్ హెగ్డే దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. ఎస్పీ సూర్యాపేట అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని తెలిపారు. ఎవరూ డబ్బులు పంపవద్దని సూచించారు. నకిలీ ఖాతాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Spread the love