– హస్తం గూటికి బీజేపీ సీనియర్లు…?
– రాజగోపాల్, వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి రహస్య మంతనాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మునుగోడులో గెలిచి.. రాష్ట్రంలో తిష్ట వేద్దామనుకుంటే, ఆ పాచిక పారలేదు… పార్టీలో చేరి ఖమ్మం జిల్లాలో మాంచి ఊపు తెస్తాడనుకున్న పొంగులేటి హ్యాండిచ్చి…కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ దెబ్బలకే వాడిపోయిన కమలానికి ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. ఈ చిక్కుతో దాని రేకులు మరిన్ని రాలిపోనున్నాయని సమాచారం. బీజేపీలో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు ఆ పార్టీని వీడి ‘అభయ హస్తం’ అందుకునేందుకు రెడీ అయ్యారు.
హైదరాబాద్‌లో భేటీ- భవిష్యత్ కార్యాచరణపై చర్చ
వినాయక చవితి పండుగ రోజైన సోమవారం మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహనరావు, చాడా సురేశ్‌రెడ్డిలు హైదరాబాద్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో వీరంతా సమావేశమయ్యారు. బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై వీరు గుర్రుగా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్కు దగ్గరవుతుండటంతోపాటు పార్టీలో బండి, ఈటల, కిషన్‌రెడ్డికే ప్రాధాన్యతనిస్తూ… తమను పట్టించుకోవటం లేదని వారు తమ సన్నిహితుల వద్ద వాపోయారని తెలిసింది. ప్రతీ సందర్భంలోనూ, ప్రతీ కమిటీలోనూ ఆ ముగ్గురికే పెద్ద పీట వేస్తూ సీనియర్లమైన తమను గుర్తించటం లేదంటూ వారు అలకపాన్పు ఎక్కారు. ఇదే విషయమై గతంలో కూడా ఈ సీనియర్లు తమ నిరసన గళాలను విప్పారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని భావించినా… ఢిల్లీ పెద్దల జోక్యంతో అది అప్పటికి ఆగిపోయింది. కానీ ఇటీవల మారిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు జోష్ పెరిగిందనే వాతావరణం ఏర్పడటంతో మళ్లీ ఈ సీనియర్లందరూ తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. మరోవైపు ఈ ఎనిమిది మందిలో ఐదారుగురిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ భావించింది. ప్రస్తుతం వారు రహస్యంగా భేటీ కావటం, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే సంకేతాలతో కమలంలో కలకలం రేగుతోంది. మొన్నటి కాంగ్రెస్ విజయభేరీ సభ నేపథ్యంలో…’సోనియాగాంధీని హాజరైనట్టు తెలిసింది. బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై వీరు గుర్రుగా ఉన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతుండటంతోపాటు పార్టీలో బండి, ఈటల, కిషన్‌రెడ్డికే ప్రాధాన్యతనిస్తూ… తమను పట్టించుకోవటం లేదని వారు తమ సన్నిహితుల వద్ద వాపోయారని తెలిసింది. ప్రతీ సందర్భంలోనూ, ప్రతీ కమిటీలోనూ ఆ ముగ్గురికే పెద్ద పీట వేస్తూ సీనియర్లమైన తమను గుర్తించటం లేదంటూ వారు అలకపాన్పు ఎక్కారు. ఇదే విషయమై గతంలో కూడా ఈ సీనియర్లు తమ నిరసన గళాలను విప్పారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని భావించినా… ఢిల్లీ పెద్దల జోక్యంతో అది అప్పటికి ఆగిపోయింది. కానీ ఇటీవల మారిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు జోష్ పెరిగిందనే వాతావరణం ఏర్పడటంతో మళ్లీ ఈ సీనియర్లందరూ తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. మరోవైపు ఈ ఎనిమిది మందిలో ఐదారుగురిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ భావించింది. ప్రస్తుతం వారు రహస్యంగా భేటీ కావటం, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే సంకేతాలతో కమలంలో కలకలం రేగుతోంది. మొన్నటి కాంగ్రెస్ విజయభేరీ సభ నేపథ్యంలో…’సోనియాగాంధీని వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా…’ అంటూ విజయశాంతి ట్వీట్ చేయటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నది. దీంతోపాటు ఈటల అనుచరుడైన ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఈ రహస్య భేటీలో పాల్గొనటంతో…మున్ముందు ఈటల కూడా హస్తం గూటికి చేరతారనే వార్తలు ఊపందుకుంటున్నాయి.