టీడబ్ల్యూజేఎఫ్‌పై తప్పుడు ప్రచారం

False propaganda against TWF– సైబర్‌ క్రైమ్‌ డీసీపీకి ఫిర్యాదు : అధ్యక్షులు సోమయ్యపై ట్రోలింగ్‌కు ఖండన
– నిందితులను గుర్తించి అరెస్టు చేయాలి
– ఫిర్యాదు చేసిన ఫెడరేషన్‌ నేతలు
నవతెలంగాణ -హైదరాబాద్‌
తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌)తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యపై తప్పుడు ఆరోపణలతో బ్రోచర్‌ సృష్టించి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి ఆనందం, పి రాంచందర్‌, బి విజరుకుమార్‌, గుడిగ రఘు, బి. జగదీష్‌, బి రాజశేఖర్‌, కోశాధికారి ఆర్‌. వెంకటేశ్వర్లు, ఇ చంద్రశేఖర్‌, ఎస్‌.కె సలీమా తదితరులు హైదరాబాద్‌లో సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవితను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో జర్నలిస్టుల సమస్యలపై పనిచేస్తున్న తమ సంఘం మీద, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిపై కొందరు వ్యక్తులు లేనిపోని అభాండా లు వేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తమ సంఘం జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యుడైన యూసుఫ్‌కు సంబంధించిన ఒక అక్రమ కేసు విషయంలో ఇటీవల తాము ఏడీజీపీ మహేష్‌ భగవత్‌ను కలిసిన ఫొటో, యూసుఫ్‌ క్రిమినల్‌ అంటూ మరో ఫొటోను మార్ఫింగ్‌ చేసి పలు తప్పుడు ఆరోపణలతో బ్రోచర్‌ను సష్టించారనీ. దాన్నీ సోషల్‌ మీడియాలో పెట్టి రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు బ్రోచర్‌ ద్వారా ట్రోల్‌ చేసి ఫెడరేషన్‌ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వ్యక్తులను వెంటనే గుర్తించి వారిపై కేసు నమోదు చేయాలనీ, దీని వెనుక కుట్రను బయటపెట్టాలని డీసీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శులు తన్నీరు శ్రీనివాస్‌, , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సభ్యుడు కె పాండురంగారావు, మాజీ నేషనల్‌ సభ్యులు పద్మనాభరావు, కంతేటి రమా దేవి, హెచ్‌యూజే నాయకులు ఈ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love