రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబపాలన

– మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబపాలన కొనసాగుతోందని రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని అట్లాస్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ సోనియా గాంధీ అడుగు మోపిన రాష్ట్రం కాంగ్రెస్‌దేనినని అన్నారు. సోనియమ్మ ఇచ్చిన ఆరు హామీలు ప్రజల వద్దకు చేరాలని సూచించారు. ఈనెల 17న నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి భారీ బహిరంగ సభ విజయవంతమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌పైన ఉన్న అభిమానం విజయభేరి సభకు విచ్చేసిన ప్రజలను చూస్తే తెలిసిందని ఆనందం వ్యక్తం చేశారు. భారీ జన సమీకరణలో కాంగ్రెస్‌ సభను చూసి పార్టీలైన బీఆర్‌ ఎస్‌, బీజేపీ పార్టీల్లో గుండెల్లో గుబులు మొదలైందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించారని తెలిపారు. తెలంగాణ ప్రధాత సభలో చెప్పిన ఆరు హామీలు అమలు చేస్తారని స్పష్టం చేశారు. సోనియమ్మ మాట ఇస్తే మడమ తప్పిది లేదని ఆరు హామీల గ్యారెంటీ కార్డు ప్రతి గడపగడపకూ చేరాలని సూచించారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కేంద్రాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌పై అనేక కుట్రలు చేసి చిచ్చుపెడుతోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు పడాల వెంకటస్వామి, రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల సిద్ధేశ్వర్‌ నియోజకవర్గం సీనియర్‌ నాయకులు సన్నపు వసంతం, భీంభారత్‌, టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌, మండల అధ్యక్షులు వీరేందర్‌రెడ్డి, శేఖర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెంటయ్య గౌడ్‌, కాంగ్రెస్‌ చేవెళ్ల కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జూకన్న గారి శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ పడాల ప్రభాకర్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love