కుటుంబ పాలనలో నిరుద్యోగుల జీవితాలు నాశనం

కుటుంబ పాలనలో నిరుద్యోగుల జీవితాలు నాశనంనవతెలంగాణ-ఓయూ
పదేండ్ల కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ పాలనలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జీవితాలను సర్వనాశనమయ్యాయని కాంగ్రెస్‌ విద్యార్థి నాయకులు నరసింహ రెడ్డి, శ్రీనివాస్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌వీ సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో అక్కడ కాంగ్రెస్‌ విద్యార్థి నాయకులు పసుపు చల్లి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందలాదిమంది నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, పేపర్‌ లీకేజీలు పరీక్ష వాయిదాలు, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్లు జరపక పాఠశాల నిధులు కేటాయించక మూసి వేయించినప్పుడు, ధర్నాలు నిరసన చేపట్టకుండా ధర్నా చౌక్‌ ఎత్తివేసి, ప్రశ్నించిన మేధావులని బుద్ధి జీవులని అరెస్టు చేసి ఇదే ఓయూలో కనీస నిరసన చేపట్టకుండా విద్యార్థి ఉద్యమాలను అణచివేశారన్నారు. గ్రూప్‌-1 సక్రమంగా నిర్వహించి డీఎస్సీ పోస్టులు పెంచి, ఎన్నో నోటిఫికేషన్లు ఇస్తూ నియామకలందిస్తూ విద్యార్థి ప్రజాపక్షపాతిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్‌ రెడ్డిని విమర్శించే హక్కు మీకు లేదన్నారు. రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం కాదు 10 ఏండ్లు ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాని కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love