ఫేమస్ బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి..

నవతెలంగాణ – హైదరాబాద్: ‘ప్రపంచ భయంకరమైన బాడీబిల్డర్’గా పేరొందిన ఇలియా గోలెం(36) హార్ట్‌ఎటాక్‌తో కన్నుమూశారు. ఈనెల 6న గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ 11న ప్రాణాలు కోల్పోయారు. బెలారస్‌కు చెందిన ఈ బాడీబిల్డర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ‘ది మ్యుటాంట్’ అనే నిక్‌నేమ్‌తో పిలుచుకుంటారు. 154 కేజీల బరువున్న అతడి ఎత్తు 6.1 అడుగులు. చెస్ట్ 61 అంగుళాలు కాగా బైసెప్స్ 25 ఇంచులు ఉండటం విశేషం.

Spread the love