ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి సతీమణి కన్నుమూత

నవతెలంగాణ-హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమార్తె, సినీ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం మృతి చెందారు. సోదరి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే నంద్యాల జిల్లా డోన్‌ ఎమ్మెల్యే కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డి ఉదయమే హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. పలువురు తెదేపా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Spread the love