ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత

ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూతప్రముఖ సినీ రచయిత శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి. తమిళంలో అగ్రదర్శకులైన మణిరత్నం, శంకర్‌ తెరకెక్కించిన చాలా సినిమాలకు తెలుగులో శ్రీ రామకృష్ణ మాటలు అందించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలతో పాటు దాదాపు 300చిత్రాలకుపైగా ఆయన తెలుగులో సంభాషణలను సమకూర్చారు. సూటిగా సుత్తిలేకుండా ఉండే ఆయన సంభాషణల ఫలితమే తమిళ సినిమాలు సైతం తెలుగులో అనువాదమై తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. దీంతో ఆయా సినిమాలు తమిళంలోనే కాకుండా తమిళ:లోనూ సంచలన విజయాలు సాధించాయి. చివరిగా ఆయన రజనీకాంత్‌ నటించిన ‘దర్బార్‌’ చిత్రానికి డైలాగ్స్‌ రాశారు.

Spread the love