– సిఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ.
నవతెలంగాణ – జుక్కల్
ఈ నెల 29వ తేదిన స్థానిక ఎమ్మెలే ఇంటి ముట్టడిని సిఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు విజయవంతం చేయాలని సిఐటీయూ జిల్లా నాయకుడు సురేష్ గొండ ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు ఆశా వర్కర్లకు ప్రతి నెల వేతనాలు పనికి తగ్గ సమాన వేతనాలు రూపాయలు పద్దెనిమిది వేలు, ఈఎస్ఐ, ఫీఎఫ్ భీమై సౌకర్యం కల్పించాలని , విటితో పాటు పదకొండు ప్రధాన డిమాండ్లు నెరవెర్చాలని, నిరసనగా నియేాజకవర్గం లోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లి, పెద్ద కొడప్ గల్, పిట్లం, నిజాంసాగర్ మండలాల నుండి ఆశాలు భారిగా తరలి వచ్చి ఎమ్మెలే ఇంటిముట్టడికి విదయవంతం చేయాలని పేర్కోన్నారు.