ఉరి వేసుకుని రైతు మృతి

నవతెలంగాణ – ఉప్పునుంతల

యాసంగి పంట మిర్చి, వేరుశనగ ధాన్యం దిగుబడి రాకపోవడంతో పిల్లల చదువుల భవిష్యత్తు ఆలోచిస్తూ ఆర్థిక భారం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆలోచిస్తూ మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం ఉరి వేసుకుని రైతు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పునుంతల మండలం కోరటికల్ గ్రామానికి చెందిన రైతు కొత్తూరు మల్లయ్య (30) భార్య మైబమ్మ వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి పైకప్పు ఇనుప రాడుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు గమనించిన ఇంటి పక్కల ఇరుగు పొరుగువారు భార్యకు సమాచారం ఇవ్వడంతో భార్య ఇంటికి చేరుకొని మృతి చెందిన భర్తను చూసి బోరుణ విలపించి కన్నీరు మున్నీరు అయింది మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Spread the love