కరెంట్ షాక్ తో రైతు మృతి..

నవతెలంగాణ -పెద్దవూర
ట్రాన్స్ ఫార్మర్ కు ఫీజు వేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ట్రాన్స్ ఫార్మర్ మీదనే అక్కడికక్కడే రైతు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో చోటు శుక్రవారం చేసుకుంది రైతు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పోతునూర్ గ్రామానికి చెందిన పెండ్యాల నర్సింహా రావు(67) అను అతను తన యొక్క వ్యవసాయ భూమిలో బోర్ మోటార్ కు ట్రాన్స్ఫర్మర్ నుండి కరెంట్ రావడం లేదని ట్రాస్ఫర్మార్ ను బందు చేసి పైన వైర్ లు జాయింట్ చేయడానికి పైకి ఎక్కి రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చేతులకు, కాళ్లకు, ఛాతిపై తీవ్ర కాలిన గాయలై పూర్తిగా బొబ్బలెక్కిఅక్కడి కాక్కడే చనిపోయారు.మృతుని భార్య పెండ్యాల సుమతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించనైనది. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

Spread the love