విద్యుత్‌షాక్‌తో రైతు మృతి..

నవతెలంగాణ – కోహెడ
మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పకిడె బాలమల్లయ్య (58) తన వ్యవసాయ బావి వద్ద శనివారం విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం బాలమల్లయ్య తన వ్యవసాయ బావి వద్ద కరెంట్‌ స్టార్టర్‌కు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య పకిడె కనుకవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

Spread the love