విద్యుత్ షాక్ తో రైతు మృతి

Farmer dies due to electric shockనవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
పొలం దగ్గర గడ్డికొస్తుండగా ప్రమాదవశాత్తు  కేబుల్ వైరు తగిలి రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రఘోత్తం పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మంగళవారం దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం గౌరి అంజయ్య (71) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన పొలం వద్దనున్న బోరు మోటారు దగ్గర కొడవలితో గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు చూడకుండా  కేబుల్ వైరు తెగి ఎడమ చేతికి తగిలింది. కరెంట్ షాక్ తో తన తండ్రి కొట్టుకోవడాన్ని గమనించిన  నరేష్ షాటర్ డబ్బాలోని ఫ్యూసులు తీసేసి చూడగా అప్పటి మృతి చెందాడు. షాక్ కు గురైన మృతుడి కుమారుడు నరేష్ ఏడుపులు విన్న బాబాయ్ వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  మృత దేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love