విద్యుత్ షాక్ తో రైతు మృతి 

నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన  నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మలిగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి(40) వ్యవసాయ పనుల నిమిత్తం ఇటివల కాలంలో బోరు వేసి దానికి సంబందించిన కరెంటు వైర్లు నెలపై పర్చి ఉంచారు. ఈక్రమంలో ట్రాక్టర్ దున్నే క్రమంలో నెలపై ఉన్న విద్యుత్ వైర్లను అటుఇటు మార్చేవారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ రెడ్డి  తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ సహాయంతో అచ్చు కడుతుండగా తేలి ఉన్న పొలం నుండి వెళ్ళిన సర్విస్ వైరు ట్రాక్టర్ బ్లేడ్ కు తగిలి వుంది. మృతుడు మలిగి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి  ఇనుప ట్రాక్టర్ బ్లేడ్ ను ట్రాక్టర్ కు తగిలించే క్రమంలో ప్రమాదవస్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెదాడు. ఉదయం పొలానికి వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి మద్యాహ్నం వరకు తిరిగి రాలేదు.  ఫోన్ కూడా ఎత్తలేదు.  మృతుని భార్య  సోదరి కుమారుడిని చూసిరమ్మని చెప్పింది. అతడు బావి వద్దకు రాగానే మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి కిందపడిపోయి ఉన్నాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు.మృతుడి తండ్రి చెన్నారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ  డి.  సైదాబాబు తెలిపారు.
Spread the love