విద్యుత్ షాక్ తో రైతు మృతి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన తీరేడి భూమేశ్వర్(55) అనే రైతు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులో గల తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్ళాడు. మోటారు స్టార్ట్ చేస్తుండగా బోరుకు వెళ్లే మెయిన్ కరెంటు లైన్ తెగిపోయి కిందపడి ఉండడంతో ప్రమాదవశాత్తు కాళ్ళకి కరెంట్  వైరు తగిలి షాక్ కు గురై భూమేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు తీరేడి  రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.
Spread the love