విద్యుత్ షాక్ తో రైతు మృతి

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని కల్లేడ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన బుదవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కల్లేడ గ్రామానికి చెందిన ఉమ్మెడ చిన్నారెడ్డి(47) మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు నేలకొరిగిన మోటార్ డబ్బా,  తెగిన వైర్లను బుదవారం సాయంత్రం సరి చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక్క కుమారుడు ఉన్నారు. మృతుని బార్య చిన్న నర్సు బాయి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సయ్య తెలిపారు.
Spread the love