నవతెలంగాణ-గుండాల : పిడుగుపాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా గుండాల మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొడవటంచ గ్రామానికి చెందిన గొగ్గెల రామస్వామి(54) అనే రైతు మంగళవారం సాయంత్రం తన పశువులను మేపుకొని ఇంటికి వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో వీరాస్వామి పిడుగుపాటుకు గురై మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గుండాల మండలంలోని వివిధ పార్టీల నాయకులు పిడుపాటుతో మృతి చెందిన వీరాస్వామి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.