పాముకాటుతో రైతు మృతి

నవతెలంగాణ – భూదాన్ పోచంపల్లి: పాముకాటుతో రైతు మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వంకమామిడి గ్రామానికి చెందిన ఊదరి లింగస్వామి(45)రైతుకు ఐదు ఎకరాల సొంత పొలంతో పాటు పది ఎకరాలు కౌలు చేసుకుంటూ వరి పండిస్తున్నారు. కాగా ఆదివారం సాయంత్రం తన భార్య అనితతో పొలం పనులు ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో గట్టుపై నడుస్తున్న లింగస్వామిని పాము కాటేసింది. వెంటనే అతనిని భార్య గమనించి హుటాహుటిన హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో లింగస్వామి మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love