రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం

నవతెలంగాణ-వీణవంక : రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని పాక్స్ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా రెడ్డిపల్లి గ్రామంలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు గ్రామంలో నీ మహిళలు రైతులు ప్రత్యేకంగా ఎడ్లబండ్లను అలంకరించి ర్యాలీ తీయడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని అన్నారు. ప్రతి రైతుకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన తొలినాళ్లలోనే కాలేశ్వరం ప్రాజెక్టు చేపట్టి రైతులందరికీ సాగునీరు అందించడం పాటు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతుల నరసయ్య, ఎంపిటిసి వడ్డేపల్లి లక్ష్మీ భూమయ్య రైతు సమన్వయ గ్రామ కన్వీనర్ కట్ట కుమారస్వామి, పిఎసిఎస్ డైరెక్టర్ చెకబండి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ సీఈఓ ప్రకాష్ రెడ్డి, ఏఈఓ రాకేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, నాయకులు అడిగొప్పుల సత్యనారాయణ, పోతుల సురేష్, మాడ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love