పశు వైద్యాధికారి రాక కోసం రైతులు ఎదురుచూపు ..

Farmers are waiting for the arrival of veterinary officer..నవతెలంగాణ – కుబీర్
మండలంలోని పాల్సి పశు వైద్య శాలలో విధులు నిర్వహించే వైద్యులు బుధువారం రాకపోవడంటో ఆ గ్రామ రైతులకు సంబదించిన పశువులకు వైద్యం అందించే వైద్యులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఏదురుకోవడం జరిగింది. దింతో ప్రభుత్వం పేద మధ్య తరగతులకు సంబదించిన రైతులకు సంబదించిన పశుల వైద్యశాల లో డాక్టర్లను నియమిస్తే కానీ ఎక్కడి వైద్యులు మాత్రం అస్పత్రి కి రాకుండానే వేలకు వేలు జీతాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం సమయంలో పశు వైద్యశాలకు వచ్చి గ్రాములో ఉన్న పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పరిశీలించలిసిన అధికారి సమయ పాలనా పాటించకుండానే ఇష్టం వచ్చినప్పుడు అస్పత్రి కి రావడం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దింతో బుధువారం ఉదయం సమయంలో ఓ రైతులు సంబదించిన ఎద్దులు మరియు ఒక్క గేదెను అస్పత్రికి తీసుకువస్తే అక్కడ చికిత్స అందించే డాక్టర్ లేకపోవడంతో రైతులు వేనుదిరాగారు. దింతో ప్రయివేట్ వైద్యుల వద్దకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. దింతో ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు కల్పించుకొని డాక్టర్ ను ప్రతి రోజు అస్పత్రికి వచ్చేటల్లు చూడాలని గ్రామస్తులు కోరారు.
Spread the love