
– రైతులందరూ హాజరు కావాలి..
నవతెలంగాణ – తాడ్వాయి
రైతు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “భూభారతి” అనే కొత్త భూ సేవల డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఏప్రిల్ 14వ తేదీన అధికారికంగా ప్రారంభించిన సంగతి విధితమే. దీన్ని గురువారం 17వ తారీకు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూభారతి అమలు విధానాలు, రైతులకు మేలు, సాంకేతిక సమీకరణాలపై సమగ్రంగా చర్చించడం జరుగుతుందని, రైతులందరూ హాజరుకావాలని స్థానిక తాసిల్దార్ జె సురేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం, రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉంచడం ఇలాంటి ప్రతి సమస్య గురించి అవగాహన కలిగించినట్లు తెలిపారు. కావున మండలంలోని రైతులందరూ గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం వద్దకు హాజరు కావాలని కోరారు.