
మండల కేంద్రంలో 164 జాతీయ రహదారిపై మంగళవారం రోజున బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మండిపడ్డ బీఆర్ఎస్ సర్పంచ్ తిరుమలరెడ్డి. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన మనసులో మాటను బయట పెట్టుకున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతులకు ఏడు గంటలు కరంటు కూడ సక్రమంగా ఇవ్వకుండా రైతులను హరిగోస పెట్టారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెడితేనే రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి సర్పంచ్ తిరుమలరెడ్డి, ఉప సర్పంచ్ విట్టల్, పండరి, మాజీ సర్పంచ్ పోచయ్య, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మల్లుగొండ, నందు, సంజు పటేల్, బడే సాబ్, సజన్లాల్ నాయక్, కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు