దుంపల్లిగూడెంలో రైతు దినోత్సవం..

నవతెలంగాణ-గోవిందరావుపేట: తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపెల్లి గూడెం గ్రామం లో రైతు వేదిక లో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా అధికారులు గ్రామంలోని రైతులు గ్రామం నడివీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యవసాయం విస్తరణ అధికారి మమ్మద్ రియాజ్ గత పది సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో లక్నవరం రాంనగర్ గ్రామాల సర్పంచులు భూక్యవాణి రాజు, భూక్య మోహన్ రాథోడ్, వైస్ ఎంపీపీ సూది రెడ్డి స్వప్న పిఎసిఎస్ డైరెక్టర్ సూది రెడ్డి లక్ష్మారెడ్డి, ఏఈ జ్యోతి, ఉప సర్పంచ్ కట్ల జనార్దన్ రెడ్డి పంచాయతీ వార్డు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love