ఏర్గట్లలో ఘనంగా రైతు దినోత్సవం..

నవతెలంగాణ-ఏర్గట్ల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్గట్ల,గుమ్మిర్యాల్ క్లస్టర్ రైతు వేదికలో రైతు దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ట్రాక్టర్లు,ఎడ్ల బండ్లతో రైతులు,నాయకులు ఊరేగింపుగా రైతు వేదికలకు చేరుకుని,జాతీయ గీతాలపనతో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ లాంటిదని కొనియాడారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు,రైతు భీమా వల్ల రైతులకు చాలా మేలు జరిగిందని అన్నారు.తెలంగాణ రాక ముందు రైతులు తమ పంటలకు రాత్రిళ్ళు నీరందించదానికి వెళ్ళిన సందర్భాల్లో చాలా మంది పాముకాటు వల్ల,కరెంట్ షాక్ వల్ల ప్రాణాలు విడిచారని,కేసీఆర్ ప్రవేశపెట్టిన 24 గంటల కరెంట్ వల్ల ఆ సమస్య తీరిందన్నారు.ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి తమ చెప్పులను వరుసలో బెట్టి, నిలబడి ఎండకు ప్రాణాలు కోల్పోయారని,ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రైతుకు సులువుగా ఎరువులు అందుతున్నాయని అన్నారు.సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతు బంధు,రైతు భీమా వల్ల రైతు కుటుంబాల్లో నేనున్నానని భరోసా నింపారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి,జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్,బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పూర్ణానందం,వైస్ ఎంపీపీ సల్ల లావణ్య,ఎంపీటీసీ జక్కని మధు సూధన్,ఏఓ అబ్దుల్ మాలిక్, సర్పంచ్లు గుల్లే లావణ్య గంగాధర్,కుండ నవీన్,కట్కం పద్మాసాగర్,పత్తిరెడ్డి ప్రకాష్,గద్దెరాధ గంగారాం, మంజుల బాలాజీ గౌడ్, ఉపసర్పంచ్లు, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు సున్నపు అంజయ్య, జిల్లా మెంబర్ నెరేళ్ళ లింగారెడ్డి, ఏర్గట్ల, తాళ్ళ రాంపూర్ పిఏసీఎస్ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య,పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి,రైతులు,అధికారులు పాల్గొన్నారు.

Spread the love