స్వచ్ఛందంగా రహదారి నిర్మాణం చేసుకుంటున్న రైతులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని బుస్సా పూర్ గ్రామంలో గిద్దె కుంట పారకం 200 ఎకరాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో సోమవారం రైతులు సమావేశమై స్వచ్ఛందంగా రహదారి నిర్మాణానికి స్థలాన్ని రైతులు ఇస్తామని ముందుకు రాగా రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. బుస్సాపూర్ గ్రామంలోని గిద్దె కుంట పారకం గల సుమారు 200 ఎకరాల పంట పొలాలకు సరియైన దారి లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు  దారి కోసం కొందరు రైతులు భూ దానం చేయుటకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని ఇతర ప్రాంతాల రహదారి నిర్మాణం కోసం స్ఫూర్తిగా నిలిచారని గ్రామస్తులు అన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకుపోగా వెంటనే అధికారులు స్పందించి వందరోజుల పనిలో భాగంగా 1100 మీటర్ల దారికి గాను తొమ్మిది లక్షల 47 వేల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రహదారి నిర్మాణం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love