లారీల కొరతతో రోడ్డెక్కిన రైతన్నలు..

నవతెలంగాణ- హబ్సిపూర్: చౌరస్తాలో బైటాయించి రైతన్నల నిరసన. అధికారుల హామీతో విరమణ నవతెలంగాణ దుబ్బాక రూరల్ లారీలు లేక ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం ఆకారం రైతులు రోడ్డెక్కారు. ఈమేరకు దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ గ్రామ చౌరస్తా లో రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కాంట వేసి రెండు మూడు రోజులు గడుస్తున్నా లారీల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. దీంతో కొనుగోలు మందకోడిగా సాగుతున్నాయని ఆరోపించారు. వెంటనే అధికారులుకొనుగోలు కేంద్రాలు సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోని లారీల కొరత తీర్చాలని అన్నారు.రోడ్డు పై అన్నదాతలు నిరసన చేస్తున్న విషయం తెలుసుకుని అధికారులు హామీ ఇచ్చి పోలీసుల సహాయంతో నిరసనను విరమింపజేశారు. మరో వైపు రైతుల నిరసనతో సిద్దిపేట – రామయంపేట్ జాతీయ రహదారిపై కిలోమీటర్ వరకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

 

Spread the love