నవతెలంగాణ – నవీపేట్
రైతులు కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ కొరకు ఈ కేవైసీ తప్పక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంతో పాటు పోతంగల్, నాలేశ్వర్ గ్రామాలను వ్యవసాధికారి సురేష్ గౌడ్ తో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఈ కేవైసీ చేసుకోని రైతుల వివరాలను తెలుసుకొని వారిని కలిసి ఈ కేవైసీ చేసుకోవాల్సిందిగా సూచించారు. మండల కేంద్రంలోని పిఎసిఎస్ తో పాటు దేవి, అలివేణి, కిసాన్ ఎఫ్ ఫి వో ఎరువుల డీలర్ల స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. బినోల సొసైటీ పరిధిలోని నాలేశ్వర్ ఎరువుల గోదామును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో బినాల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు, పృథ్వీరాజ్, ఏఈఓ వసంత్, సొసైటీ కార్యదర్శులు రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.