నవతెలంగాణ – తాడ్వాయి
కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించాలని, పంటలకు మద్దతు ధరకు అదనంగా కింటాలకు రూ. 500 చెల్లించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదని, దొంగలు పడ్డాక అరు నెళ్లకు కుక్కులు మోరిగినట్లుగా ఉంది సర్కారు తీరు అని తెలిపారు. కేసీఆర్ పొలం బాట పట్టకే సర్కారు పంటల విషయంలో కళ్ళు తెరిచిందన్నారు. వడగళ్ళు, ఎండిన పంటలకు ఎకరాకు 25 వెల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో చేస్తానన్న హామీలు వెంటనే అమలు చేయాలి నిలదీశారు. ఎలక్షన్ కోడ్ ఉందని ఉత్తమ్ కుమార్ చావు కబురు చల్లగా చెప్పారని మండిపడ్డారు. ఎలక్షన్ కు ముందు రైతులకు లేనిపోని అమలు గాని హామీలను ఇచ్చి రైతులను దగా చేసిందని ధ్వజమెత్తారు. యాసంగి పంటలకు ఇస్తానన్న బోనస్ కల్పించాలని, కౌలు రైతులకు ఎకరాకు 15 వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు.బి అర్ ఎస్ అధికారంలో ఉన్నా, లేకున్నా మాది ఎప్పుడు రైతు పక్షమే అని, రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరా కూడా ఎండలే.. కాంగ్రెస్ వచ్చాకే పంటలు ఎందుతున్నాయి. రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, ఇన్పుట్ సబ్సిడీని అందించి రైతుల ఆదుకోవాలి అన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెరిగాయని, కాంగ్రెస్ హయాంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మాని రైతుల్ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఆలేటి ఇంద్రారెడ్డి, మాజీ ఎంపిటిసి దానక నరసింహారావు, నాయకులు సల్లూరి లక్ష్మణ్, సిద్ధబోయిన వసంతరావు, రజనీకర్ రెడ్డి తదితరులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.