– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్
నవతెలంగాణ – కంటేశ్వర్
రైతులకు ఒకే దెబ్బ రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలి. అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ పట్టణంలో నాందేవ్ వాడలో గల తెలంగాణ రైతు సంఘం భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఒకేసారి రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని 9 సంవత్సరాలు గడిసిపోతున్నప్పటికిని రుణ మాఫీ కాకపోవడంతో బ్యాంకులవారు వడ్డీలకు వడ్డీ వేసి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పించాలని యాసంగి పంటలు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను పరిహారం ఇవ్వాలని కౌలు రైతులను ఆదుకోవాలని పోడు భూములకు పట్టాలు కేవలం నాలుగు లక్షల మాత్రమే ఇస్తానని అన్నారు అయినా ప్రతి ఒక్కరికి పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హక్కు పత్రాలు ఇచ్చి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని అన్నారు వానాకాలం పంట వేసుకోవటానికి వర్షాలు పడుతున్న తరుణంలో నకిలీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు యాసంగి పంటల డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని లేనియెడల రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాధరప్ప, పల్లపు వెంకటేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు గంగామణి తదితరులు పాల్గొన్నారు.