రైతులు నిబంధనలు పాటించాలి

– అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు
– పత్తి, వరి కొనుగోళ్లకు పక్క ఏర్పాట్లు చేయాలి
కందనూలు: పత్తి రైతులు పత్తిని అమ్మేటప్పు అధికారులు సూచించిన నిబం ధనలు పాటించాలని అదనపు కలెక్టర్‌ కే.సీతారామారావు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్లో పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్‌ సీసీఐ, రవాణా శాఖల అధికారులు, జిన్నింగ్‌ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాల్‌కు రూ.7,020 కనీస మద్దతు ధర ప్రకటించిందన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని అమ్మకాని కి తీసుకువచ్చేటప్పుడు ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకం, పట్టా పహాని జిరాక్స్‌ కాపీలని తీసుకురావాలన్నారు. పత్తిని శుభ్రపరిచి తేమశాతం 8 నుంచి 12లోపు ఉండేటట్లుగా చూసుకోవాలన్నారు. జిన్నింగ్‌ మిల్లు యాజమాన్యాలు, సీసీఐ అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలన్నారు. అనంతరం వరి కొనుగోళ్లపై సమావేశం నిర్వహిం చారు. జిల్లాలో 2లక్షల మెట్రి టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్‌ తెలిపారు. డీఆర్‌డీఏ నుంచి 15 వరి కొనుగోలు కేంద్రాలు, పీయస్‌ఈస్‌ నుంచి 215 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏ గ్రేడ్‌ క్వింటాలు వరికి రూ.2,203 మద్దతు ధర, రెండో రకానికి క్వింటాలుకు రూ.2,183 ఉన్నట్లు ఆయన తెలిపారు. నవం బర్‌ నుంచి జరిగే వరి కొలుకోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జయకుమార్‌ సీసీఐ డిప్యూటీ మేనేజర్‌, మార్కెటింగ్‌ అధికారిని బాలమని, ఆర్టీవో ఎర్రిస్వామి, ఇన్చార్జి డీఎస్‌ఓ స్వామి కుమార్‌, డీసీఓ ప్రత్యనా యక్‌, పీడీ డీఆర్‌డీఏ నర్సింగరావు, ఫైర్‌ ఆఫీసర్‌ కష్ణమూర్తి, అధికారు లు, జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love