రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

నవతెలంగాణ – చివ్వేంల
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతు మోగదాల లక్ష్మణ్ గౌడ్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని వల్లభపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు  ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు యాట మహేశ్వరి, లక్ష్మమ్మ, షాయిన్ బేగం, ఎల్లమ్మ, సునీత, కమల, నాగార్జున, బాలాజీ, ముత్తయ్య, సైదులు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love