
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ ఇంచార్జ్ సెక్రెటరీ రామ నర్సమ్మ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని బండమీది చందుపట్ల, పిల్లల జగ్గు తండ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలోసిబ్బంది ఎల్క కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, మహేందర్, వీరన్న, సందీప్, మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.