ఫాస్టాగ్‌ కేవైసీ గడువు మళ్ళీ పొడిగింపు..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్ గడువు నిన్నటితో (గురువారం)తో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఫాస్టాగ్‌ అనేది జాతీయ రహదారులు,ఇతర రహదారులపై వాహనాల నుండి టోల్ పన్ను వసూలు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ వ్యవస్థ. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ సిస్టమ్ తీసుకురావడానికి ఫాస్ట్-కేవైసీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఒక్కో వాహనానికి ఒక కేవైసీ ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వాహనం, ఒక ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. NHAI వాహనదారులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి జనవరి 31 వరకు గడువు విధించింది. ఇక కేవైసీ ప్రక్రియ పూర్తి కానప్పుడు ఫిబ్రవరి 29 వరకు గడువును పొడిగించింది.

Spread the love