లద్దాక్‌లో ఘోర ప్రమాదం..

Fatal accident in Ladakh– లోయలో పడ్డ ఆర్మీ వ్యాన్‌..తొమ్మిది సైనికుల మృతి
లద్దాక్‌ : లద్దాక్‌ లేహ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి దూసు కెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు చనిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, దక్షిణ లద్దాక్‌లోని నియోమాలోని ఖేరి వద్ద శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఎనిమిది మంది సైనికులతో పాటు ఓ జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ఉన్నారు. ట్రక్కు కరూ నుంచి గ్యారీసన్‌ నుంచి లేహ్ సమీపంలోకి క్యారీకి వెళ్తున్న సమయంలో లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 34 మంది వరకు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నా..కేంద్రరక్షణ శాఖ వారిని హెలికాప్టర్ల తరలించటంలేదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.ఇలా తరలించకపోవటం వల్లే ఆర్మీ వాహనాలు లోయల్లో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love