– ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢకొీట్టిన మరో కంటైనర్
– వంటకోసం తెచ్చుకున్న సిలిండర్ పేలి.. అకస్మాత్తుగా మంటలు
– డ్రైవర్‌తోపాటు, క్లీనర్ సజీవ దహనం
– పుర్రె, మొండెం మాత్రమే మిగిలి.. భయంకరంగా దృశ్యాలు..
నవతెలంగాణ-నార్సింగి
జాతీయ రహాదారిపై ఆగి ఉన్న ఓ కంటైనర్ లారీని వెనుక నుంచి వచ్చిన మరో కంటైనర్ లారీ బలంగా ఢకొీట్టింది. ప్రమాద ధాటికి డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోగా.. వంటకోసం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. వారిద్దరూ సజీవ దహనం అయ్యారు. కేవలం పుర్రె, మొండెం మాత్రమే మిగిలి ఉన్న.. ఈ భయానక ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం కాస్లాపూర్ శివారులోని జాతీయ రహదారి 44పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ భజంత్రీ బసవరాజ్(35), క్లీనర్ పుజేర్ నాగరాజు(27) కంటైనర్ లారీలో గత నెల 29న బెంగుళూరు నుంచి నాగపూర్‌కు బయల్దేరారు. అయితే నార్సింగి మండలం కాస్లాపూర్ గ్రామ శివారులో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన మరో కంటైనర్ లారీని.. వెనుక నుంచి వచ్చి బసవరాజ్ నడిపిస్తున్న కంటైనర్ బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో బసవరాజు, నాగరాజు ఇద్దరూ క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. అదే సమయంలో వంటకోసం తెచ్చుకున్న గ్యాస్ సిలిం డర్ పేలడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న మృతదేహానికి సగభాగం కాలిన పుర్రె, పక్క సీట్లో పడుకుని ఉన్నట్టు ఉన్న మృతదేహానికి కాలిపోయిన మొండెం, పుర్రె మాత్రమే మిగిలి ఉండడంతో.. ఘటనను చూసిన వారు భయబ్రాంతులకు గురయ్యారు. అంతేకాకుండా ఈ నిలిపి ఉన్న లారీలో లోడ్ చేసి ఉన్న టైర్లకు మంటలు వ్యాపించాయి. విషయం తెలు సుకున్న తూప్రాన్ సీఐ శ్రీధర్, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సాయంతో మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాద ఘటనపై నార్సింగి ఎస్‌ఐ నర్సింలు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.